Glorious Telugu Thalli Canada Toronto Telugu Times Full Day Literary Meet

టొరంటో తెలుగు టైమ్స్, తెలుగు తల్లి కెనడా మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన ‘పూర్తి రోజు సాహిత్య సభ’ వైభవంగా జరిగింది. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమాన్ని ‘మా తెలుగు తల్లి’ గేయంతో ప్రారంభించారు. అనంతరం తెలుగు భాష అభ్యున్నతి కోసం కృషి చేసిన పలువురిని సత్కరించారు. జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న ముఖ్యులు కూడా వారిని అభినందించారు. ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 10 నుంచి సాయంత్రి 6 వరకూ ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’ కార్యక్రమాన్ని శ్రీ రవి వారణాసి గారు నిర్వహించారు. వీరితోపాటు శ్రీమతి సరోజ కొమరవోలు, శ్రీ రెండుచింతల గోపాలకృష్ణ, శ్రీ విజయ్ సేతుమాధవన్, శ్రీ సర్దార్ ఖాన్ ఆయనకు సహకరించారు. ఆ తర్వాత జరిగిన ‘‘ఖుషీఖుషీగా నవ్వుతూ..’’ కార్యక్రమాన్ని డాక్టర్ రామ్ ప్రయాగ నిర్వహించగా.. శ్రీమతి ఉమవంక, శ్రీమతి శ్రీవాణి ముప్పాళ్ళ, శ్రీమతి స్వర్ణ ధనరాజ్, శ్రీమతి అమిత పినికేశి, శ్రీమతి ప్రశాంతి, శ్రీమతిఅపర్థ, శ్రీమతి కాంతి, శ్రీమతి కిరణ్, శ్రీమతి నివేదిత, శ్రీమతి అరుణ సహకారం అందించారు. సాయంత్రం 5.50గంటలకు ధన్యవాద చందనముల కార్యక్రమంతో ‘పూర్తి రోజు సాహిత్య సభ’ ముగిసింది.

 

                    Advertise with us !!!