రష్మిక వాటే లక్కీ హీరోయిన్..

Rashmika Mandanna upcoming movies

ఒకవైపు టాలీవుడ్ లో పలు పెద్ద ప్రాజెక్టులు చేస్తూనే, మరోవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోవడం చూస్తుంటే రష్మిక నక్క తోక తొక్కిందేమో అనిపించక మానదు. ఇప్పుడు రెండు సినిమాలు ఓకే చేసిన రష్మిక, అప్పుడే తన మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, లైన్ లో పెట్టిందని తెలుస్తుంది. ఈ విషయాన్ని రష్మికే స్వయంగా తన ఇన్ స్టా లైవ్ లో చెప్పుకొచ్చింది.

తన మూడవ బాలీవుడ్ సినిమాకు సైన్ చేయడానికి రెడీగా ఉన్నట్లు రష్మిక చెప్పేసింది. తన మొదటి సినిమా పూర్తయ్యే లోపే రెండో సినిమాకు సంతకం చేసింది. టాప్ టక్కర్ వీడియోతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక, మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఇక రెండో సినిమాకే అమితాబ్ తో గుడ్ బాయ్ లో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో రష్మిక, అమితాబ్ లు తండ్రీ కూతుళ్లుగా కనిపిస్తారు.  

ఇదిలా ఉంటే లైవ్ లో రష్మిక ను ఒక ఫ్యాన్ బాలీవుడ్ ప్రాజెక్టుల గురించి అడగ్గా.. నేను రెండు బాలీవుడ్ సినిమాలు ఇప్పటికే చేస్తున్నాను. త్వరలోనే మూడో సినిమాకు ఓకే చెప్పబోతున్నా.. అని రిప్లై ఇచ్చింది. అయితే అది ఎవరితో, ఏంటి అని వివరాలు మాత్రం చెప్పలేదు రష్మిక. కన్నడ, తెలుగు ఇండస్ట్రీల్లో తనకంటూ ఒక రేంజ్ క్రియేట్ చేసుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకుంటూ ముందుకెళ్తుంది. ఇవి కాకుండా ప్రస్తుతం బన్నీ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో చేస్తుంది. ఆ తర్వాత చరణ్, శంకర్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో కూడా నటించబోతుందని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా రష్మిక లక్ మామూలుగా లేదు అనే విషయం మాత్రం అర్థమవుతుంది కదూ..  

 


                    Advertise with us !!!