48 గంటల్లో జాబ్ ఇవ్వాల్సిందే, 3 గంటల్లో బెడ్ ఉండాల్సిందే: జగన్

cm ys jagan review on coronavirus

స్పందన సమీక్షలో సీఎం  వైఎస్‌ జగన్‌ అధికారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ల నుంచి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. 104 కాల్‌ సెంటర్‌ గురించి జగన్ ఎక్కువగా మాట్లాడారు. ఈ కాల్‌ సెంటర్‌ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలి అని స్పష్టం చేసారు. ఆస్పత్రికి వెళ్లడమా, క్వారంటైన్‌కు పంపడమా, హోం ఐసొలేషనా? ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలి అని సూచించారు.

కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 నెంబర్‌ అన్నది వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అని స్పష్టం చేసారు. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలి అని సూచించారు. మందులు ఫ్రీగా ఇవ్వాలి అని పేర్కొన్నారు. 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలి అని ఆయన ఆదేశించారు. జేసీ (గ్రామ , వార్డు సచివాలయాల అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలని సూచనలు చేసారు. మన అధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ చూడాలి అని ఆదేశించారు.

నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషథాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌ డెస్క్‌లు వాటిలో ఆరోగ్యమిత్రలు అందుబాటులో ఉండాలి అని స్పష్టం చేసారు. సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలి అని జగన్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి అని ఆయన ఆదేశించారు. వాటికి ఇంఛార్జ్‌లను నియమించాలి. జిల్లా స్థాయి ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలి అని సూచించారు.

అందులో ఔషథ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉండాలి అని ఆదేశించారు. అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలి అని స్పష్టం చేసారు. ఎక్కడ ఖాళీలున్నా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించండి అని సూచించారు. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయండి అని స్పష్టం చేసారు. ప్రజలు ఒకే చోట చేరకుండా చూడాలి అని, పెళ్లిళ్లలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి అని స్పష్టం చేసారు. స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలి అని ఆయన సూచించారు. 


                    Advertise with us !!!