రామ్ తర్వాతి సినిమా హీరోయిన్ కూడా ఫిక్స్

priya prakash varrier to romance ram

రీసెంట్ గా రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. దీంతో రామ్ తో పాటు తన ఫ్యాన్స్ కూడా ఎంతో ఢీలా పడ్డారు. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే తమిళ డైరక్టర్ లింగుస్వామి డైరక్షన్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి రామ్ కు జోడీగా కనిపించనుంది.

లింగుస్వామి తర్వాత రామ్ చేయనున్న సినిమాలో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ కనిపించే ఛాన్సుందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. ప్రియా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటుంది. ఈమధ్య వచ్చిన నితిన్ చెక్ సినిమాలో కనిపించిన ప్రియా ప్రకాష్ ఆ తర్వాత తేజ సజ్జాతో కలిసి ఇష్క్ చేసింది. ప్రస్తుతం ఈ భామకు వస్తున్న ఆఫర్లు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. తెలుగు సినిమా కథలను వినడం మీదే ప్రస్తుతం ప్రియా ఫోకస్ చేసిందని, తను చేయాలనుకుంటున్న సినిమాల్లో రామ్ తర్వాతి సినిమా కూడా ఉందనే వార్త వినిపిస్తుంది.  

ఇదిలా ఉంటే గత కొన్నాళ్లుగా రామ్ తర్వాతి సినిమా మారుతి డైరక్షన్ లో ఉండనుందనే వార్త వస్తున్నవిషయం విదితమే. ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న మారుతి ఆ తర్వాత సినిమాను రామ్ తో చేయాలనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. మరి ఆ సినిమా కోసం ప్రియా ప్రకాష్ ను అనుకుంటున్నారా? లేక మారుతి లాగే బోయపాటి తో కూడా రామ్ సినిమా ఉంటుందనుకుంటున్నారు ఆ సినిమా కోసం ప్రియా ను అడిగారా అదీ కాకుండా ఇది కేవలం రూమర్ మాత్రమేనా అనేది  తెలీదు.  

 


                    Advertise with us !!!