వచ్చినట్టే వచ్చి, తిరిగి వెళ్లిపోయిన నజ్రియా నాజిమ్ 'అంటే సుందరానికీ' షూటింగ్ క్యాన్సల్

Nazriya Nazim cancel shooting of Nani s Ante Sundaraniki

హీరోయిన్  నజ్రియా నాజిమ్ హైదరాబాద్ కు వచ్చింది తొలిసారిగా తెలుగు సినిమా   'అంటే సుందరానికీ' షూటింగ్ లో పాల్గొంటుంది అంటూ తెగ ప్రచారం చేసారు చిత్ర యూనిట్. ఇప్పుడేమైంది వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్ళిపోయింది.  విషయానికొస్తే..... నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'అంటే సుందరానికీ'. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించిన చిత్ర యూనిట్‌కి కరోనా షాక్ తగిలింది. నజ్రియా నాజిమ్, ఫాహద్ ఫాజిల్ జోడీకి సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. మళయాలీ ఇండస్ట్రీలో నజ్రియా, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ సాధించాయి. ఇప్పుడీ భార్యాభర్తలు తెలుగు తెరపై సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఫాహద్ ఫాజిల్ 'పుష్ప'లో విలన్‌గా నటిస్తుండగా,  నాని సరసన 'అంటే సుందరానికీ' సినిమాలో నజ్రియా నటిస్తోంది. ఆయా సినిమాల షూటింగ్స్ నిమిత్తం ఇటీవలే ఇద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు నజ్రియా నో చెప్పిందట. ప్రస్తుతం 'అంటే సుందరానికీ' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా షూటింగ్ చేయాలని ప్లాన్ చేసారు చిత్ర యూనిట్.

అయితే హీరోయిన్ నజ్రియా మాత్రం ఈ పరిస్థితుల్లో తాను షూటింగ్‌లో పాల్గొన్నానని తెగేసి చెప్పిందట. దీంతో నాని సహా 'అంటే సుందరానికీ' టీమ్ ప్యాకప్ చెప్పేసి కొన్నిరోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారని సమాచారం. నజ్రియా తిరిగి భర్తతో కలిసి చెన్నై వెళ్లిపోయిందట. నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న ఈ 'అంటే సుందరానికీ' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే హీరోయిన్ నజ్రియాకు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. దీంతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేస్తున్నారు నాని. కరోనా కారణంగా ఆ సినిమాల షూటింగ్స్ కూడా ఆపేశారని తెలిసింది.


                    Advertise with us !!!