ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్

in-a-phone-call-with-pm-modi-joe-biden-pledges-steadfast-support-for-people-of-india

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ మధ్య ఫోన్‍ సంభాషణ జరిగింది. వీరివురు ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు.కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న భారత్‍కు సాయం చేసేందుకు యూరోపియన్‍ యూనియన్‍, జర్మనీ, ఫ్రాన్స్లాగే అమెరికా కూడా ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్‍లో మాట్లాడుతూ కోవిడ్‍ రెండో దశ సృష్టించిన కల్లోలం నుంచి భారత్‍ను ఆదుకుంటామని అన్నారు. ఇంతకాలం ఆపి వుంచిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‍ ముడి సామగ్రిని భారత్‍కు పంపేందుకు అమెరికా అంగీకరించిన మరుసటి రోజే బైడెన్‍ మోడీకి ఫోన్‍ చేసి భారత్‍ను ఆదుకుంటామన్నారు. బైడెన్‍తో ఫోన్‍ సంభాషణ గురించి మోదీ ట్వీట్‍ చేస్తూ కరోనా  మహమ్మారితో ఇరు దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిపై తామిరువురమూ చర్చించామన్నారు. సాయం అందించేందుకు ముందుకు వచ్చిన బైడెన్‍కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 


                    Advertise with us !!!