నిరాడంబరంగా సీతారాముల పరియణ ఘట్టం

Kodanda Ramudu Kalyanam in Vottimitta

కోదండరాముడు, జానకీదేవి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కోవెలలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పండు వెన్నెలలో నిండు చంద్రుడి సాక్షిగా సీతారాముల పరిణయ ఘట్టం నిరాడంబరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారుల పర్యవేక్షణలో కార్యక్రమాల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణవేదిక ప్రాంతాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‍.. జానకీరాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‍, టీటీడీ జేఈవో సదా భార్గవి, టీటీడీ పాలక మండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్‍, అధికారులు, అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ప్రవేశం కల్పించలేదు.

 


                    Advertise with us !!!