బన్నీ సినిమాలో ట్యాలెంటెడ్ హీరోయిన్

Aishwarya Rajesh is Allu Arjun Sister in Pushpa

బన్నీ, సుకుమార్ ల కాంబోలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సెకండ్ వేవ్ ప్రభావం బాగా ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా, అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. పుష్ప లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. కీలక పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. ఇప్పుడు పుష్ప గురించి మరో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

పుష్ప లో ఐశ్వర్యా రాజేష్ కీలక పాత్రలో కనిపించనుందట. వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ కు భార్యగా నటించిన ఐశ్వర్య ఈ సినిమాలో హీరోకు సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించనుందట. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకమట. అందుకే ఆ పాత్ర కోసం ఎంతో మంది హీరోయిన్స్ ను సంప్రదించి చివరకు ఐశ్వర్య ను ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇందులో తను పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో పాటూ తన క్యారెక్టర్ కు ఒక లవ్ ట్రాక్ కూడా ఉంటుందని, తర్వాత ఆ క్యారెక్టర్ చనిపోతుందని, పుష్పరాజ్ ఆ చావుకు ప్రతీకారం తీర్చుకుంటాడని కూడా తెలుస్తుంది.  

ప్రస్తుతం తమిళంగా స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ ట్యాలెంటెడ్ హీరోయిన్ తెలుగమ్మాయి అయినా సరే తమిళంలో మంచి గుర్తింపు దక్కించుకుంది. అటు తమిళంతో పాటుగా ఇటు తెలుగులో కూడా వరుస ఆఫర్లు పట్టేస్తుంది ఐశ్వర్యా రాజేష్. కాకపోతే కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేసుకుంటూ పోతుంది. మరి ఐశ్వర్యా రాజేష్ బన్నీకి సిస్టర్ గా ఏమేర అలరిస్తుందో చూడాలి.  

 


                    Advertise with us !!!