నాగ్ తో పోటీ పడనున్న బన్నీ విలన్

Samuthirakani to play a villain in Nagarjuna s Telugu movie

బంగార్రాజు పేరు వినగానే సోగ్గాడే సినిమాలో పల్లెటూరి బుల్లోడిగా పంచె, ముల్లుగర్ర చేతబట్టి, గ్లాసులెట్టుకున్న నాగార్జున రూపం కళ్లముందు కనిపిస్తుంటుంది. ఆ క్యారెక్టర్ జనాలకు అంత బాగా రీచ్ అయింది. అప్పట్నుంచి బంగార్రాజు టైటిల్ తో సినిమా చేయడానికి నాగార్జున ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ కథ సెట్ అవడానికే చాలా టైమ్ పట్టింది.

బంగార్రాజు కథ పైన డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ ఎంతో కాలంగా కసరత్తు చేస్తూ వచ్చాడు. చివరకు నాగార్జునతో ఓకే అనిపించే సరికి నాగ్ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఇప్పుడు అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జులై సెకండ్ వీక్ లో బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లనున్నట్లు రీసెంట్ గా నాగార్జున వెల్లడించారు. దీంతో మొత్తానికి ప్రాజెక్ట్ ఓకే అయిందనే విషయమైతే క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాలో కూడా నాగ్ పక్కన రమ్యకృష్ణ హీరోయిన్ గా కనిపించనుంది. వీరిద్దరితో పాటు ఒక యువజంట కూడా ఈ సినిమాలో సందడి చేయనున్నట్లు చెప్తున్నారు. ఈ కథంతా గ్రామీణ నేపథ్యంలో సాగుతుండగా, ప్రతినాయకుడిగా  ఎవరైతే బావుంటుందబ్బా అనుకుంటున్న టైమ్ లో కయ్యానికి కాలుదువ్వే విలన్ కనిపించాడట కళ్యాణ్ కృష్ణ కు. ఇంతకీ ఎవరబ్బా ఆ విలన్ అనుకుంటున్నారా? అల వైకుంఠపురములో అప్పలనాయుడుగా, క్రాక్ సినిమాలో కటారి కృష్ణ గా మెప్పించిన సముద్రఖని ఇప్పుడు బంగార్రాజు లో విలన్ గా కనిపించనున్నాడట. బంగార్రాజులో విలన్ క్యారెక్టర్ పవర్ ఫుల్ కావడంతో సముద్రఖనిని ఫైనల్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.  

 


                    Advertise with us !!!