నేరుగా ఓటీటీలోకి నారప్ప..?

makers plan to release Victory Venkatesh Narappa movie directly into OTT platform

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వస్తున్న సినిమా నారప్ప. తమిళ సూపర్ హిట్ సినిమా అసురన్ కు ఇది అధికారిక రీమేక్. వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నారప్పను నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 14న ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఎన్నో సినిమాలు వాయిదా పడుతూ రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. దానిలో భాగంగానే నారప్ప కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ఉగాది పోస్టర్ లో కూడా రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించలేదు. ఈ క్రమంలో నారప్ప థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసే ఛాన్సుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.              

కరోనా కారణంగా పోయిన సంవత్సరం చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు వెళ్లాయి. అయితే లాక్ డౌన్ తీసేసి మళ్లీ థియేటర్లు ఓపెన్ చేయడంతో రిలీజ్ లు ఊపందుకున్నాయి. రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్లను అనౌన్స్ చేసుకున్నాయి. మళ్లీ ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ తో గతేడాది సిట్యుయేషనే వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ సినిమాలన్నీ ఓటీటీ దారి పట్టనున్నాయని చెప్తున్నారు. ఇందులో వెంకీ నటించిన నారప్ప కూడా ఉందని, మరో రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని చెప్తున్నారు. అమెజాన్ ప్రైమ్ నారప్పను కొనే అవకాశాలున్నాయని, అసురన్ కూడా ప్రైమ్ లోనే స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ వారే కొనే ఛాన్సుందంటున్నారు. ఒకవేళ నారప్ప ఓటీటీ లో రిలీజ్ అయితే మరికొన్ని సినిమాలు కూడా ఈ సినిమాను చూసి ఓటీటీ బాట పట్టే అవకాశాలున్నాయి. త్వరలోనే నారప్ప రిలీజ్ పై క్లారిటీ రానుంది.  

 


                    Advertise with us !!!