ప్రపంచ వ్యాప్తంగా గులాబీ శ్రేణుల‌తో తెరాస ఆవిర్భావ దినోత్సవం: మహేష్ బిగాల

Teresa Emergence Day with Pink Arrays Around the World: Teresa NRI Co-ordinator Mahesh Bigala

2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). అప్పట్లో ఉద్యమ ఊపిరిగా మారిన కేసీఆర్... రాష్ట్రంలో యువతనూ, పెద్దవారిని అందర్నీ ఏక తాటిపై నడిపి... ఢిల్లీ పెద్దలు సైతం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చేలా చేయడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఫలితంగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఐతే... రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే ఉద్యమపార్టీ... ఇప్పుడు రాజకీయ పార్టీగా దూసుకెళ్తోంది. మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా వున్నా అన్ని దేశాలనుంచి పాల్గొనేటట్టు గొప్పగా ప్రణాళిక మహేష్ బిగాల సిద్ధం చేసారు. కానీ ఈ కరోనా మహమ్మారి వలన ఇంకా అంత స్తంభించి పోయి వుంది, ఈ సారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ గారి పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా వున్నా 50 తెరాస ఎన్నారై శాఖలతో ఈ శనివారం 01 మే 2021 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు జూమ్ ద్వారా తెరాస ఎన్నారై ప్లినరీ ని నిర్వహిస్తున్నారని  మహేష్ బిగాల తెలిపారు.


                    Advertise with us !!!