వీధి అరుగులో....అబ్బురపరిచిన జ్యోతిర్మయి ప్రసంగం

annamayya-sankirtanalu-social-perspective-programm-on-april-25th-in-veedi-arugu

అన్నమయ్య మార్గం మానవాళికి అనుసరణీయమని, కుల, మత, జాతి వివక్షతను పక్కనపెట్టి సంఘీభావంతో అన్నమయ్య బోధించిన సామాజిక స్పహ, మానవతాభావాలను అలవర్చుకొని మనమందరం మెలగాలని అన్నమయ్య సంకీర్తనల ప్రచారదీక్షాపరులు, సంఘసేవకులు కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న తెలుగు వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వీధి అరుగు’ వేదిక ఆధ్వర్యంలో నాలుగో కార్యక్రమంగా ఏప్రిల్‍ 25వ తేదీ సాయంత్రం ‘అన్నమయ్య సంకీర్తనలు - సామాజిక దృక్పథం’ పేరుతో నిర్వహించిన అంతర్జాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 16 దేశాల నుంచి 400 మందికి పైగా తెలుగువారు పాల్గొని విజయవంతం చేశారు. సుమారు 2,600 మంది ఫేస్‍బుక్‍ ద్వారా వీక్షించారు. వెబ్‍ఎక్స్ అంతర్జాల వేదికపై దాదాపు రెండు గంటలు పాటు సాగిన ఈ కార్యక్రమంలో అన్నమయ్య సంకీర్తనలలోని సామాజిక స్ప•హ అనే అంశంపై  కొండవీటి జ్యోతిర్మయి అద్భుంతంగా ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి సింగపూర్‍ నుంచి ప్రముఖ కథారచయిత్రి, కవయిత్రి, వక్త, వ్యాఖ్యాత అయిన రాధిక మంగిపూడి అనుసంధానకర్తగా వ్యవహరించారు. మొదటగా జర్మనీ నుండి ప్రముఖ గాయని ‘పాడుతా తీయగా’ ఫేమ్‍ శివాని సరస్వతుల ‘‘భావయామి గోపాలబాలం’’ మరియు ‘‘బ్రహ్మమొక్కటే’’ అనే అన్నమయ్య సంకీర్తనలను తన సుమధుర గాత్రంతో ఆలపించి అందరిని అలరించారు. అమ్మ జ్యోతిర్మయి మాట్లాడుతూ ‘‘కలియుగంలో యుగధర్మానికి అనుగుణంగా జనబాహుళ్యంలోనికి సులువుగా చొచ్చుకుపోయే విధంగా సంకీర్తనామార్గాన్ని ఎంచుకుని, అన్నమయ్య చక్కటి తేట తెలుగు భాషలో శ్రోతల హృదయాంతరాలను తాకే పదాల కూర్పుతో అద్భుతమైన సంకీర్తనలు రచించారని తెలిపారు. అనంతరం, ఆధ్యాత్మికతతో కూడిన నవసమాజాన్ని మన అందరమూ ఎలా నిర్మించవచ్చు అనే అంశంపై ఆలోచన రేకెత్తించే విధముగా సభ్యులతో చర్చిస్తూ ధర్మ సందేహ నివ•త్తి గావించారు. ‘అమ్మ జ్యోతిర్మయి నిర్వహిస్తున్న ‘అన్నమయ్య ‘యోగిక్‍ లైఫ్‍’ కార్యక్రమం ద్వారా, విపత్కర పరిస్థితుల్లో ఎంతోమందిని నిరాశ నిస్ప •హల నుంచి బయటకు తీసుకురావడానికి దోహదపడే కార్యక్రమాలను మా ‘‘వీధి అరుగు’’ వేదిక ద్వారా ప్రవాసులందరికి పరిచయం చేయ సంకల్పించామని నిర్వాహకులు తరిగోపుల వెంకటపతి, జోజెడ్ల సుబ్బారావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయ్‍ భాస్కర్‍, నాగభైరవ రవిచంద్ర, పారా అశోక్‍ కుమార్‍, లక్ష్మణ్‍, పర్రి విజయ్‍ కుమార్‍, అన్నపూర్ణ మహీంద్ర, తొట్టెంపూడి గణేష్‍, కొక్కుల సత్యనారాయణ, దాసరి శ్రీని, గురుభగవతుల శైలేష్‍, కవుటూరు రత్నకుమార్‍ నాయుడు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పూర్తి కార్యక్రమాన్ని https://fb.watch/55wlCtNeHx ఈ లింక్‍లో చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.

 


                    Advertise with us !!!