మోడీ నాశనం చేసుకుంటున్నారా...?

World s biggest COVID 19 crisis threatens Modi s grip on India

దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం రావటం లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరి మీద ఎన్ని విమర్శలు చేసినా సరే ఇప్పుడు వాళ్లు చేసిన తప్పు కారణంగానే దేశంలో వైద్య రంగం ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా కరోనా ఉన్న సమయంలో జనాభా ఎక్కువగా ఉన్న భారతదేశం నుంచి ఆక్సిజన్ ని భారీగా ఇతర దేశాలకు కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేసింది.

కొన్ని దేశాలకు సహాయం కూడా అందించింది. అలాగే మందుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరించింది అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు దేశంలో పరిస్థితి ఈ విధంగా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా మోడీ కొన్ని అంశాల్లో ప్రతిపక్షాలను పదేపదే విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే మోడీని ప్రతిపక్షాలు గట్టిగా టార్గెట్ చేస్తునాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు చెబుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్లడంతో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు. రాజకీయంగా మోడీ తీసుకునే నిర్ణయాల విషయంలో ముందస్తు ప్రణాళిక అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పరిపాలన విషయంలో కూడా ప్రధానమంత్రి మోడీ ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటిదేమీ ఇప్పటివరకు జరగలేదు. దీనితో ప్రజల్లో మోడీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరిగిపోతోంది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళడమే కాకుండా రాష్ట్రాల మీద భారం వేసే విధంగా వ్యవహరిస్తోంది.

అంతేకాకుండా ధరల పెరుగుదల విషయంలో కూడా ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంతో ఇప్పుడు ప్రజలు అందరూ కూడా మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరించారు కాబట్టి దేశంలో ఈ పరిస్థితి ఉందని అలాగే ఎన్నికల ప్రచార సభలో అలాగే బహిరంగ సభ విషయంలో ప్రధాన మంత్రి హోదాలో ఉండి కూడా మోడీ వెనకా ముందు ఆలోచించకుండా సభలు నిర్వహించారని ఆరోపణలు వినబడుతున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని కష్టాల్లోకి నెట్టింది అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణతో పాటు కుంభమేళా విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వెళ్ళిందని అభిప్రాయపడుతున్నారు. 

 


                    Advertise with us !!!